ఆడపిల్లల్ని కన్నందుకు అత్తింటివారి వేధింపులు...ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య

Published : Aug 28, 2018, 03:23 PM ISTUpdated : Sep 09, 2018, 12:12 PM IST
ఆడపిల్లల్ని కన్నందుకు అత్తింటివారి వేధింపులు...ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య

సారాంశం

ఆడ పిల్లలకు జన్మనివ్వడమే ఆ తల్లి చేసిన పాపం. వరుసగా రెండోసారి ఆడ శిశువు పుట్టడంతో ఆ మహిళపై అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. వీటిని తట్టుకోలేకపోయిన ఆ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.   

ఆడ పిల్లలకు జన్మనివ్వడమే ఆ తల్లి చేసిన పాపం. వరుసగా రెండోసారి ఆడ శిశువు పుట్టడంతో ఆ మహిళపై అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక ఆ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబుగాం గ్రామానికి చెందిన ఆడె సంతోష్ కు మూడేళ్లక్రితం సుశీలబాయితో వివాహమైంది. అయితే ఈ దంపతులకు మొదటి సంతానంగా ఆడ పిల్ల పుట్టింది. దీంతో భర్తతో పాటు అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. అయితే రెండు నెలల క్రితం ఈమె రెండో సారి కూడా ఆడపిల్లకే జన్మనిచ్చింది. దీంతో ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. 

సుశీల ఈ వేధింపులను తట్టుకోలేక పోయింది.  దీంతో ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు కూతుళ్లకు తన చేతులతోనే విషమిచ్చి చంపిన ఆ తల్లి వారు చనిపోయాక తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది.  స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో భైంసా డీఎస్పీ రాములు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
  
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌