ఈ నెల 26 నుండి రెండో విడత బస్సు యాత్ర: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ

By narsimha lode  |  First Published Oct 22, 2023, 5:24 PM IST

ఈ నెల  26 నుండి రెండో విడత బస్సు యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తుంది.  బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై కాంగ్రెస్ నేతలు  చర్చిస్తున్నారు.


హైదరాబాద్:ఈ నెల 26వ తేదీ నుండి రెండో విడత బస్సు యాత్రను చేపట్టాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.  రెండో విడత బస్సు యాత్రపై  తెలంగాణకు  చెందిన కాంగ్రెస్ నేతలు  ఆదివారం నాడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.  

ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు  తెలంగాణలో మూడు రోజుల పాటు తొలి విడత బస్సు యాత్ర  తెలంగాణలో జరిగింది. ఈ నెల 26వ తేదీ నుండి  రెండో విడత యాత్రను కాంగ్రెస్ చేపట్టనుంది. మూడు రోజుల పాటు యాత్ర సాగనుంది.బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై  కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. ఎక్కడి నుండి బస్సు యాత్ర ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలనే దానిపై  కాంగ్రెస్ నేతలు  చర్చిస్తున్నారు.బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై  రెండు రోజుల్లో స్పష్టత  వచ్చే అవకాశం ఉంది. 

Latest Videos

undefined

  ఈ నెల  18న బస్సు యాత్రను  కాంగ్రెస్ పార్టీ  బస్సు యాత్రను రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ప్రారంభించారు. మూడు రోజుల పాటు బస్సు యాత్రలో  రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అధికార బీఆర్ఎస్ పై  రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ నెల  20న  రాహుల్ గాంధీ పర్యటనలో మార్పులు జరిగాయి. నిజామాబాద్  టూర్ ను రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు.ఆర్మూర్ సభతోనే  రాహుల్ గాంధీ  టూర్ ముగిసింది.  ఢిల్లీలో అత్యవసర సమావేశం కారణంగా  రాహుల్ గాంధీ  ఆర్మూర్ నుండే టూర్ ను ముగించిన విషయం తెలిసిందే. ఈ నెల 31న  కాంగ్రెస్  పార్టీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.  కొల్లాపూర్ లో  కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది.ఈ సభలో  ప్రియాంక గాంధీ పాల్గొంటారు. 

also read:కాంగ్రెస్‌లో చేరేందుకు బీజేపీ నేతల క్యూ: ఆర్మూర్ సభలో రాహుల్ సంచలనం

జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్ లో చేరే  సమయంలో  కొల్లాపూర్ లో బహిరంగ సభను నిర్వహించాలని  ఆ పార్టీ భావించింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా  బహిరంగ సభ వాయిదా పడింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల  31న కొల్లాపూర్ లో  బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ విషయమై  కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి నివాసంలో ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు.

click me!