కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై దర్యాప్తు జరిపించాలి: రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కిషన్ రెడ్డి

Google News Follow Us

సారాంశం

 కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై  దర్యాప్తు జరపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  డిమాండ్ చేశారు.ఈ విషయమై డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాయాలని కోరారు.

హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై  దర్యాప్తు జరపాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారంనాడు కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి  బీజేపీ కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.  మూడేళ్లలోనే మేడిగడ్డ బ్రిడ్జి కుంగిపోవడం దారుణమన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాఫ్ అయిందని ఆయన సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన ప్రజల సొమ్ము వృధా అయిందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
మేడిగడ్డ బ్రిడ్జి కుంగిపోవడంపై ప్రభుత్వం ఇంతవరకు  ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

డ్యామ్ సేఫ్టీ బిల్లును  ఆమోదించి డ్యామ్ సేప్టీ అథారిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఆహ్వానించి ప్రాజెక్టును పరిశీలించాలని ఆయన కోరారు.ఈ విషయమై తాను కూడ  కేంద్ర ప్రభుత్వానికి  లేఖ రాస్తానని  చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత, భద్రతను పరిశీలించాలని  డ్యామ్ సేఫ్టీ అథారిటీని పంపాలని  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖను కోరుతానని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 

ఇవాళ 52 మందితో తొలి జాబితాను విడుదల చేసినట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు. ఈ జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు  చోటు కల్పించినట్టుగా తెలిపారు.మాజీ ఎంపీలు,  మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మున్సిపల్ చైర్మెన్లకు  జాబితాలో చోటు దక్కిందని  కిషన్ రెడ్డి వివరించారు.

also read:మేడిగడ్డ బ్యారేజీపై కుంగిన రహదారి.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్యనిలిచిపోయిన రాకపోకలు..

దసరా తర్వాత  రెండో విడత  జాబితాను విడుదల చేస్తామన్నారు.  తొలి జాబితాలో  బలమైన అభ్యర్థులకు అవకాశం కల్పించినట్టుగా  కిషన్ రెడ్డి చెప్పారు. 
ఈ నెల 27న  అమిత్ షా, చివరి వారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  రాష్ట్రంలో  ప్రచారం నిర్వహిస్తారన్నారు.  దసరా తర్వాత ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యతిరేక వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటామని  కిషన్ రెడ్డి చెప్పారు.ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని కిషన్ రెడ్డి  ప్రజలను కోరారు.తమకు అవకాశం ఇస్తే ప్రజల సమస్యలను పరష్కరిస్తామని ఆయన తెలిపారు.