కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొంటే ఇన్సూరెన్స్: ఉత్తమ్

By narsimha lodeFirst Published Sep 8, 2019, 12:42 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సర్కార్ పై పోరాటానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 11 నుండి ఆందోళనలకు ఆ పార్టీ ప్లాన్ చేసింది.

హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి రాతి స్థంబాలపై కేసీఆర్ తో పాటు ప్రభుత్వ పథకాల చిత్రాలను చెక్కడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమం పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ అవినీతిని  ప్రజలకు వివరించనున్నట్టుగా ఆయన తెలిపారు.

లక్ష రూపాయాల రుణ మాఫీని వెంటనే చేయాలని  ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, రైతులకు పంటల భీమాను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు.

ఆసరా పెన్షన్లు చెల్లింపులో ఆలస్యమైందన్నారు.  మరో వైపు నల్లమలలో యురేనియం మైనింగ్ తవ్వకాలపై మాజీ ఎంపీ వి.హనుమంతరావు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని తమ పార్టీ ప్రతినిధులు ఆదివారం నాడు సందర్శిస్తారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొన్నవారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నామన్నారు.ఈ విషయాన్ని మల్లు భట్టి విక్రమార్క పరిశీలిస్తారని ఆయన చెప్పారు.

click me!