ఆపరేషన్ ఆకర్ష్: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

By narsimha lodeFirst Published Mar 3, 2019, 3:18 PM IST
Highlights

పార్టీ మారుతామని ప్రకటించిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని  స్పీకర్‌ను కలవాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. 
 

హైదరాబాద్: పార్టీ మారుతామని ప్రకటించిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని  స్పీకర్‌ను కలవాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. 

సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించిన నిరసన తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. 

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ సర్కార్  నీరుగారుస్తోందన్నారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలను తెలంగాణ సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.

పార్టీ మారాలని నిర్ణయం తీసుకొన్న ఇద్దరు ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని  పార్టీ శ్రేణులకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. పినపాక, ఆసిపాబాద్ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఉత్తమ్ ప్రకటించారు.

ఎంత డబ్బుతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌ కొనుగోలు చేసిందో చెప్పాలన్నారు.ఈ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకు ఇచ్చే డబ్బును టీఆర్ఎస్ ఎక్కడి నుండి తీసుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల తీర్పును అవమానపర్చే విధంగా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్ తీరును నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

శాసనమండలిలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కూడ ఇదే రకంగా తమ పార్టీలో టీఆర్ఎస్ చేర్చుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మీకు బలం లేకున్నా ఐదో అభ్యర్ధిని ఎలా నిలబెట్టారని టీఆర్ఎస్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

ముగిసిన సీఎల్పీ భేటీ: గాంధీ విగ్రహాం ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్నా

సీఎల్పీ భేటీ నుండి అర్ధాంతరంగా వెళ్లిన కోమటిరెడ్డి: నాయకత్వంపై విసుర్లు

click me!