న్యాయం చేయలేని ఈ పదవెందుకు ... రాజీనామాపై హింట్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Siva Kodati |  
Published : Aug 02, 2022, 05:49 PM ISTUpdated : Aug 02, 2022, 05:57 PM IST
న్యాయం చేయలేని ఈ పదవెందుకు ... రాజీనామాపై హింట్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సారాంశం

రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్ని సమస్యల పరిష్కారానికి తన రాజీనామానే సరైన మార్గమన్నారు. ఈ విధంగానైనా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందనుకుంటే రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.   

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందంటే రాజీనామాకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. తాను, తన ప్రజలు సంతోషంగా లేరని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని పదవి ఎందుకు అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని సమస్యల పరిష్కారానికి తన రాజీనామానే సరైన మార్గమన్నారు. రాజీనామా అంశం తెరపైకి రాగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారని ఆయన దుయ్యబట్టారు. ఈ విధంగానైనా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందనుకుంటే రాజీనామా చేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 

కాగా.. కాంగ్రెస్ లో సుధీర్ఘ కాలం నుంచి ప‌ని చేస్తున్న ఆయ‌న‌.. బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం సాగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆయ‌న భేటీ ఈ ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. ప‌లు సంద‌ర్భాల్లో ఈ వాద‌న‌ను తిప్పికొట్టిన రాజ్ గోపాల్ రెడ్డి.. అంత‌ర్గ‌తంగా మాత్రం పార్టీ మారేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వ‌డం ప‌ట్ల ఆయ‌న కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ విష‌యం ప‌లు మార్లు ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద కూడా వెల్ల‌డించారు. తెలంగాణ‌లో ప‌లు పార్టీల్లోని ముఖ్య‌మైన నాయ‌కుల‌ను త‌న‌లో చేర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీని కోమ‌టిరెడ్డి వ్య‌వ‌హారంలో కూడా వేగంగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఆయ‌న బీజేపీలో చేర‌డం ఖాయమైన‌ట్టుగా కొంత కాలంగా మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. 

ALso Read:ఎటూ తేల‌ని ‘కోమ‌టిరెడ్డి’ వ్య‌వ‌హారం.. మూడు రోజుల్లో నిర్ణ‌యం తీసుకోనున్న కాంగ్రెస్ హైక‌మాండ్..

పార్టీ మారేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న త‌న అనుచ‌రుల‌తో మండ‌లాల వారీగా ఆయ‌న ఇటీవ‌ల స‌మావేశాలు కూడా నిర్వ‌హించారు. అయితే ఆగ‌స్టు మొద‌టి వారంలో ఆయ‌న కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఇంకా ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వచ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న‌ను చేజార్చుకోవ‌డం ఇష్టం లేదు. అందుకే ఆయ‌న‌తో ప‌లువురు ముఖ్య నాయ‌కులు భేటీ అయ్యారు. పార్టీ మార‌కుండా ఉండేందుకు బుజ్జ‌గింపులు కూడా జ‌రిపారు. కానీ ఆయ‌న బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపార‌ని, అదే విష‌యాన్ని వారితో స్ప‌ష్టంగా చెప్పార‌ని తెలిసింది. 

ఇకపోతే.. పార్టీ మారే అంశంపై కాంగ్రెస్ పార్టీ హైక‌మాండ్ కొంత స‌మ‌యం తీసుకోవాల‌ని రాజ్ గోపాల్ రెడ్డిని కోరిన‌ట్టు తెలుస్తోంది. తాము ఢిల్లీ నాయ‌కుల‌తో మాట్లాడి నిర్ణ‌యం చెపుతామ‌ని రాష్ట్ర నాయ‌కులు ఆయ‌న‌కు వెల్ల‌డించారు. అయితే మ‌రో రెండు, మూడు రోజుల్లో ఈ నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. రాజ్ గోపాల్ రెడ్డి విష‌యాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తెలియజేసిన త‌రువాత.. ఆమె నిర్ణ‌యం మేర‌కు త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఆ పార్టీకి చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు చెప్పారు. కోమ‌టిరెడ్డికి సంబంధించిన విష‌యాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీకి నివేదిక రూపంలో అంద‌జేయనున్నారు. ఈ త‌తంగం పూర్తి అయిన త‌రువాతే మిగితా చ‌ర్య‌లు ఉండనున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు