వికారాబాద్ జిల్లాలో మంగళవారం నాడు ఉదయం నుండి కురుస్తున్న వర్షాలతో రోడ్లకు గండ్లు పడ్డాయి.ధీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్: Vikarabad జిల్లాలో మంగళవారం నాడు ఉదయం నుండి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో వికారాబాద్ జిల్లాలో ని పలు ప్రాంతాలకు వెళ్లే Roads తెగిపోయి రాకపోకలు బందయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి,చేవేళ్ల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కూడా తెగిపోయాయి.
ఇబ్రహీంపట్నం- గోపాల్ గోశాల వద్ద చెక్ డ్యామ్ కు గండి పడింది. నారాయణపురం -జిన్నారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.వికారాబాద్ -దన్నారం మధ్య రాకపోకలు బందయ్యాయి. వికారాబాద్ -గరడేపల్లి వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
undefined
Telangana రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. మరి కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా మూసీ నదికి కూడా వరద పెరిగే అవకాశం ఉంది. దీంతో Musi పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జూలై చివరి మాసంలో కురిసిన వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. అంతకు ముందు గోదావరికి వరద పోటెత్తడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల స్రవేశించడంతోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది.