తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్

First Published Dec 15, 2017, 6:38 PM IST
Highlights
  • మూడున్నరేళ్లుగా ముఖేష్ గౌడ్ మూగనోము
  • ఆత్మీయ సమావేశంతో తెర మీదకు
  • టిఱర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు గుసగుసలు
  • రెండు టికెట్లు ఇస్తే టిఆర్ఎస్ తీర్థం ఖాయం

రాహుల్ గాంధీ సారధ్య బాధ్యతలు చేపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడే వార్త ఇది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ కు గురిచేసే ముచ్చట ఇది. ఇంతకూ ఆ ముచ్చటేందనుకుంటున్నరా? అయితే చదవండి ఈ వార్త.

గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్న ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో యాక్టీవ్ గా పనిచేస్తలేడు. దీంతో ఆయన కాంగ్రెస్ లో ఉంటాడా ఉండడా అన్న చర్చలు గతంనుంచీ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన తన ఆప్తులు, అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. మంత్రులు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తోపాటు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిలాంటి పెద్ద నేతలంతా హాజరయ్యారు. అందరితో ఆత్మీయ భోజనం చేశారు.

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ముఖేష్ గౌడ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహించారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చే వరకు మంత్రివర్గంలో కొనసాగారు. ఇక 2014 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.

ఇటీవల ఆయన కొడుకు విక్రం గౌడ్ తనమీద తానే కాల్పులు జరిపించుకుని పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసులో ఆయనే తొలి ముద్దాయిగా అరెస్టయి జైలుకు వెళ్లివచ్చాడు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ముఖేష్ గౌడ్ కుటుంబం కాల్పుల ఘటనతో మళ్లీ రాజకీయ తెర మీదకు వచ్చింది.

ముఖేష్ గౌడ్ టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు చర్చలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ముఖేష్ తమకు రెండు అసెంబ్లీ సీట్లు కావాలని అడుగుతున్నట్లు టిఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. తనకు గోషామహల్ సీటు ఇస్తూ.. తన కొడుకు విక్రం కు ముషీరాబాద్ టికెట్ అడిగినట్లు చెబుతున్నారు. అయితే టిఆర్ఎస్ నుంచి కేవలం ఒకే సీటుకు హామీ వచ్చిందని, రెండో సీటు విషయంలో హామీ దొరకలేదని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ముఖేష్ గౌడ్ ఫ్యామిలీకి పెద్ద పీఠ వేశారు. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో ముఖేష్ గౌడ్ కొడుకును మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. దాంతోపాటు ముఖేస్ కూతురుకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడి వెళ్తారా? కాంగ్రెస్ లోనే కొనసాగుతారా అన్న చర్చ కూడా సాగుతోంది.

మరోవైపు పార్టీ మారుతారని వస్తున్న రూమర్లపై ముఖేష్ గౌడ్ స్పందించారు. ‘‘నేను ఇప్పడి కైతే  నేను కాంగ్రెస్ లోనే ఉన్నా.. టీఆరెస్ లోకి వెళ్లేందుకే ఈ సమావేశం పెట్టాననడం వాస్తవం కాదు.. నా కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు అందరు నన్ను పరామర్శించారు.. అందుకే ఈ ఆత్మీయ సమ్మేళనా నికి అన్ని పార్టీల నేతలను ఆవ్వానించాను. దేవుడి కి మొక్కుకున్నందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశా.. 2019లో నేను గోషామహల్ నుండే పోటీచేస్తా... కాంగ్రెస్ పార్టీ పై నాకెలాంటి అసంతృప్తి లేదు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై జనవరి లో స్పందిస్తా’’ అని ముఖేష్ మీడియాతో చెప్పుకున్నారు.

దీంతో ముఖేష్ వ్వవహారం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

click me!