భోజనం పెట్టేందుకు వెళ్తున్నా... నన్ను ఆపమని చెప్పిందెవడు: పోలీసులతో రేవంత్ వాగ్వాదం

By Siva KodatiFirst Published May 16, 2021, 2:53 PM IST
Highlights

గాంధీ ఆసుపత్రి వద్ద కరోనా రోగుల బంధువులకు భోజనాలు పెట్టడానికి వెళుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ ఎంపీగా నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెళుతుంటే ఇలా అడ్డుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారు. 

తాను లోకల్ ఎంపీని.. నన్ను ఆపమని చెప్పిందెవడంటూ రేవంత్ ఫైరయ్యారు. నన్ను ఆపడానికి ఆర్డర్స్ కాపీలు చూపాలని ఎంపీ డిమాండ్ చేశారు. తాను ఇక్కడి ఎంపీనని.. మీ ఆంక్షలు గాంధీ ఆసుపత్రి దగ్గర పెట్టుకోవాలని.. బేగంపేటలో కాదని రేవంత్ హితవు పలికారు.

Also Read:రోజూ వెయ్యిమంది కరోనా బాధితులకు ఉచిత భోజనం.. ప్రారంభించిన రేవంత్ రెడ్డి

తాను గాంధీ, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నానని... మీలాగే నేను కూడా ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని ఎంపీ అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. 

కాగా, గాంధీ ఆసుపత్రి దగ్గర కరోనా రోగుల బంధువులకు నిత్యం వెయ్యి మందికి అన్నదానం చేసే కార్యక్రమాన్ని శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో రోజు ఈ కార్యక్రమాన్ని గాంధీతో పాటు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా చేపట్టాలని ఆయన భావించారు. దీనిలో భాగంగా ఆ కార్యక్రమానికి వెళుతున్న రేవంత్‌ను బేగంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వాహనాన్ని చుట్టుముట్టి ముందుకు కదలనీయలేదు.
 
click me!