గోపన్‌పల్లి భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్:గోపన్‌పల్లి భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు కొండల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గోపన్‌పల్లి భూముల విషయంలో రేవంత్ రెడ్డి సోదరులు అక్రమాలకు పాల్పడ్డారని రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
ఈ భూముల విషయంలో రేవంత్ రెడ్డి సోదరులకు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారనే నెపంతో రెవిన్యూ అధికారి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. గోపన్‌పల్లిలోని సర్వే నెంబర్ 127లో భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారని రెవిన్యూ అధికారులు తేల్చారు.
undefined
Also read:కేటీఆర్ ఫాం హౌస్‌పై డ్రోన్: ఎయిర్‌పోర్టులో రేవంత్ అరెస్ట్
ఈ భూములను రేవంత్ రెడ్డి తమ వద్ద నుండి లాక్కొన్నారని కొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం కూడ తెలిసిందే. ఇదిలా ఉంటే శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని ప్రభుత్వ భూమిని అక్రమంగా లాక్కొనేందుకు చూస్తున్నారని రేవంత్ రెడ్డి సోదరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2005లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఖాళీ చేయించడానికి కుట్ర చేస్తున్నారని గురువారం నాడు పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. తమ భూమిని తమ నుంచి దూరం చేయకుండా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
రేవంత్ సోదరుల పిటిషన్‌పై విచారణ చేపట్టింది కోర్టు. అసలు ఏం జరిగిందనే దానిపై అధికారులను అడిగి తెలుసుకుంటామని కోర్టు ప్రకటించింది. ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.