అన్నంత పనే చేశారుగా: ప్రగతిభవన్ ను తాకిన రేవంత్ రెడ్డి, అరెస్ట్

By Nagaraju penumalaFirst Published Oct 21, 2019, 12:18 PM IST
Highlights

ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ను ముట్టడించేందుకు బైక్ పై వచ్చారు. రేవంత్ రెడ్డిని గమనించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: ఎట్టకేలకు మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నిన్నటి నుంచి పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 

ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి రేవంత్ రెడ్డి ఆచూకీ లేకుండా పోయారు. ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. 

నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ను ముట్టడించేందుకు బైక్ పై వచ్చారు. రేవంత్ రెడ్డిని గమనించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎంతమంది పోలీసులు అడ్డుకున్నా ప్రగతిభవన్ గేటును తాకుతానని చెప్పిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే ప్రగతిభవన్ గేటను తాకారు. 
 
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ముట్టడి నేపథ్యంలో  పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తోంది. 

ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలను సైతం అరెస్ట్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే పోలీసులు రేవంత్ రెడ్డి నివాసాలతోపాటు అనుచరులు ఇళ్లను తనిఖీలు చేశారు. 

అలాగే ప్రగతిభవన్ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లను సైతం పోలీసులు తనిఖీలు చేపట్టారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకించి బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ఈ పరిణామాల నేథప్యంలో ఆకస్మాత్తుగా బైక్ పై ప్రగతిభవన్ చేరుకున్నారు రేవంత్ రెడ్డి.

అనంతరం అక్కడ నుంచి నేరుగా ప్రగతిభవన్ లోపలికి వెళ్లిపోయారు. ప్రగతిభవన్ ను ముట్టుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి నల్ల టీషర్ట్ ధరించి ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ప్రగతిభవన్ గేటును తాకుతానని తాను చెప్పానని అనుకున్నట్లుగానే తాను తాకినట్లు చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. తాను గేటు తాకానని కేసీఆర్ నియంత్వ పోకడలకు స్వస్తి చెప్పకపోతే నాలుగున్నర కోట్ల మంది ప్రగతిభవన్ ను ముట్టడిస్తారని హెచ్చరించారు. 

ఆర్టీసీ కార్మికులు సమస్యలను పరిష్కరించడం లేని టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు వద్దన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 

ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్చలకు పిలవాలని సూచించారు. అలాగే ఆత్మహత్యలకు పాల్పడ్డ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ప్రగతిభవన్ ను గోడలు బద్దకొడతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్‌ నేతల హౌస్ అరెస్ట్, రేవంత్ రెడ్డి సహా కీలక నేతల కోసం పోలీసుల గాలింపు

ప్రగతి భవన్ ముట్టడి.. బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత

click me!