బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐం పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ . ఈసారి ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.
కేసీఆర్ ఆస్తుల మీద ఈడీ, ఐటీ విచారణలు ఎందుకు వుండవని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. నాకు దేశంలో ఇల్లు అవసరం లేదన్నారు. కోట్లాది ప్రజల గుండెల్లో ఉన్న చోటు నాకు చాలని రాహుల్ పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐం పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
పార్లమెంట్‌లో బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈసారి ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ఖతమైందని.. ఆ పార్టీలోని నేతలు కాంగ్రెస్‌లోకి వస్తామని అంటున్నారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.