
తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) వరంగల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో ఆయన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం 7 గంటలకు రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రైతు డిక్లరేషన్ ప్రకటించనున్నారు రాహుల్. రైతులు, యువతే లక్ష్యంగా రాహుల్ వరంగల్ టూర్ చేపట్టారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి 8:00 గంటలకు వరంగల్ నుండి రోడ్ మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో బస చేస్తారు.
శనివారం నాడు మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. 12:50 నుంచి 1:10 మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ నేతల సమావేశంలో పాల్గొంటారు. 2:45 నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ కార్యక్రమం అనంతరం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్ మార్గంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.
ఇకపోతే.. 2023 ఎన్నికల్లో Telanganaలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు రైతు సమస్యలపై తీసుకొని ఇవాళ వరంగల్ లో సభను ఏర్పాటు చేశారు. ఈ సభ విజయవంతం చేసి ప్రత్యర్ధులకు సవాల్ విసరాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. ఈ సభకు జన సమీకరణను కూడా పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సన్నాహాలు చేసుకొంటుంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహాకర్తగా Sunilను ఆ పార్టీ నియమించుకుంది. సునీల్ ఇచ్చిన సూచనలు, సలహాలతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో అడుగులు వేస్తుంది. వరంగల్ సభలో కూడా సునీల్ కూడా ఈ సభకు వచ్చారు. ఈ సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా సునీల్ పార్టీ నేతలతో చర్చించారు.