ఆ విషయంలో జగన్ సర్కార్ ను మోడల్ గా తీసుకొండి..: కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ

By Arun Kumar PFirst Published Jul 26, 2021, 5:30 PM IST
Highlights

కేవలం ఒక్క రూపాయికే నిరుపేదలకు రేషన్ బియ్యం ఇస్తున్నా ప్రజలు ఇబ్బందిపడుతున్నారని... అలా ఇబ్బందిపడకుండా వుండాలంటే ఏపీలో జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధానాన్ని ఫాలో అవ్వాలంటూ సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. 

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు నూత‌న రేష‌న్ కార్డులు ఇవ్వడంతో పాటు రేష‌న్ పంపిణీలో నూత‌న సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌ని సీఎం కేసీఆర్ కు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

రాష్ట్రంలో కేవలం ఒక్క రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నా వాటిని తీసుకోవ‌డంలో ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని తెలిపారు.  6కిలోల బియ్యం తీసుకోవ‌డానికి రవాణాతో క‌లిపి 20 రూపాయ‌లు వెచ్చించాల్సి వ‌స్తుంద‌న్నారు. దీనివల్ల నిరుపేద ప్రజలపై భారం పడుతోందన్నాని సీఎంకు వివరించారు ఎంపీ కోమటిరెడ్డి.  

read more  దళిత మహిళా కౌన్సిలర్ పై కేసు... ఇదేనా దళిత సాధికరత?: కేసీఆర్ ను నిలదీసిన కోమటిరెడ్డి

ఏపీలో జగన్ ప్రభుత్వం లబ్దిదారులకు ఇంటి వద్దే రేష‌న్ బియ్యం అందిస్తున్నారు... ఈ పంపిణీ విజ‌య‌వంతం అయ్యింద‌ని తెలిపారు. దానిని మోడ‌ల్‌గా తీసుకుని తెలంగాణలో కూడా ఇంటింటికి రేష‌న్ స‌రుకులు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు. సివిల్ స‌ప్లై శాఖ వాలంటీర్ల‌ను నియ‌మించి ఇంటింటికి రేష‌న్ స‌రుకులు పంపిణీ చేస్తే రేష‌న్ కార్డుదారుల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సూచించారు. 


 

click me!