పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

By sivanagaprasad kodatiFirst Published Dec 21, 2018, 11:09 AM IST
Highlights

తెలంగాణ శాసనమండలిలోని కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడంపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత. కాంగ్రెస్ తనకు ఎలాంటి అన్యాయం చేయలేదని.. పార్టీలో తగిన గౌరవాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు. 

తెలంగాణ శాసనమండలిలోని కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడంపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత. కాంగ్రెస్ తనకు ఎలాంటి అన్యాయం చేయలేదని.. పార్టీలో తగిన గౌరవాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు.

అయితే ప్రభుత్వ పథకాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన నచ్చాయన్నారు. అన్నింటికి మించి టీఆర్ఎస్ వెంట ప్రజలున్నారని.. వాళ్లతో కలిసి పనిచేయాలనే పార్టీ మారామని లలిత స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేయాలని లేఖ ఇచ్చామని ఆమె వెల్లడించారు.

మరో ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్‌కు కొంత నష్టం జరిగిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి ప్రచారం చేయడం తమకు నచ్చలేదన్నారు. తమకు సీఎం కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వలేదని..బేషరతుగానే తాము టీఆర్ఎస్‌లో చేరామని సంతోష్ స్పష్టం చేశారు. 

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

click me!