ఈటల బిజెపిలో చేరడం బిగ్ మిస్టేక్... టీఆర్ఎస్ లోనే వుండాల్సింది: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

By Arun Kumar PFirst Published Jun 14, 2021, 1:28 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేకన్నా టీఆర్ఎస్ లోనే కొనసాగితే  బాగుండేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.   

జగిత్యాల: ఎమ్మెల్యే పదవి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన బీజేపీలో చేరేకన్నా టీఆర్ఎస్ లోనే కొనసాగితే  బాగుండేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  ఈటెల బీజేపీలోకి వెళ్ళడం ఆయన తప్పిదమేనని...  ఒంటరిగా పోరాడితే తెలంగాణ సమాజం ఆయనతో ఉండేదన్నారు. అయినా బిజెపి చెప్పుచేతల్లోనే టీఆర్ఎస్ వుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 

జగిత్యాల జిల్లా  కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పరిశీలనలో ఉందన్నారు. హైకమాండ్ ఇంకా పిసిసి అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకోలేదని తేల్చేశారు. 

''తెలంగాణ రాష్ట్రం లో విద్యను సిఎం అమ్మకానికి పెట్టాడు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగ నియమాకాలు లేవు. ఇప్పటికే రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఎంప్లొయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనేమో ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు తెలియాలి'' అన్నారు. 

read more  తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపిలో చేరిన ఈటల, ఏనుగు, తుల ఉమ

''తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకి సంవత్సరాలుగా మధ్యంతర భృతి లేదు. నూతనంగా అమలు చేస్తున్న పిఆర్సి జూన్ 2018 నుండి అమలు కావాలి. మూడు సంవత్సరాల పిఆర్సి కాలపరిమితిని ప్రభుత్వ ఉద్యోగులు కొల్పుతున్నారు. కోల్పోయిన పిఆర్సిని ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఇవ్వడంతో నష్టపోతారు. అలాంటిది సంబరాలు ఎందుకో ఉద్యోగ సంఘాల నాయకులకె తెలియాలి'' అన్నారు. 

''సాధారణ ఉద్యోగులకు కనీస వసతులు కల్పించనప్పుడు మీ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం ఎలా అవుతుంది? కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్ ని మంత్రి మండలి నుండి తొలగించిన విధానంపైన మాట్లాడం... కానీ ఇతర మంత్రుల అవినీతిపై మాట్లాడతాం. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్  పై ఎందుకు విచారణ చేయరు?  2014 కు ముందు ఉన్న కేసీఆర్ ఆస్తులెన్ని... ఇప్పుడు ఉన్న ఆస్తులెన్ని... విచారణ చేయాలి.  అవినీతి ఆరోపణల ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరపాలి'' అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.   
 

click me!