మా ఎమ్మెల్యేల వల్లే అమ్మ కోరిక నెరవేరలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆవేదన

By Arun Kumar PFirst Published Mar 12, 2019, 5:45 PM IST
Highlights

తెలంగాణలో మంగళవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన టిపిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఎన్నికలకు ముందే ఓటమిపాలయ్యారు. ఇలా ఎమ్మెల్సీ పదవికి దూరమవడానికి గల కారణాలను మీడియాకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి లోనయయ్యారు.   

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో పార్టీ మారకుంటే తాను ఎమ్మెల్సీగా గెలిచేవాడినని నారాయణ రెడ్డి తెలిపారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకున్నారని విమర్శించారు. అందువల్లే తాను ఎమ్మెల్సీ పదవిని చేపట్టలేకపోతున్నానని... అందుకు బాధగా వుందన్నారు.  
  
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగయితే తన కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారో అదే మాదిరిగా మా అమ్మ కూడా నా రాజకీయ ఎదుగుదల చూడాలని కోరుకుంటూ వుండేదన్నారు. అలా తల్లి కోరిక నేరవేర్చడానికి తనకు వచ్చిన ఓ మంచి అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల చేజారిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజాధనంతో కేసీఆర్ ఎమ్మెల్యేలను కొంటూ ప్రతిపక్షాల ఉనికే లేకుండా చేయాలనుకుంటున్నారని నారాయణరెడ్డి విమర్శించారు.  

తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగే  అవకాశం కల్పించి....గెలుపు కోసం టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఎంతో కృషి చేశారన్నారు. కానీ చివరినిమిషంలో రాజకీయ సమీకరణలు మారడంతో వారు కూడా ఏం చేయలేకే ఎన్నికలను బహిష్కరించారన్నారు. ఇలా తనకు ఓ మంచి అవకాశాన్ని ఇచ్చిన వారిద్దరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నారాయణరెడ్డి వెల్లించారు. 

click me!