అప్పుడే పెళ్లి ఎందుకు అన్నారని..

Published : Mar 12, 2019, 12:14 PM IST
అప్పుడే పెళ్లి ఎందుకు అన్నారని..

సారాంశం

అక్కకన్నా.. ముందు తనకే పెళ్లి చేయమని అడిగింది.. దానికి తండ్రి నిరాకరించడాడని.. ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

అక్కకన్నా.. ముందు తనకే పెళ్లి చేయమని అడిగింది.. దానికి తండ్రి నిరాకరించడాడని.. ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘన కరీంనగర్ జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగపూర్‌ గ్రామంలో సోమవారం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చేప్యాల కనకయ్యకు ముగ్గురు కూతుళ్లు. కాగా.. ఒక కుమార్తెకు వివాహం అవ్వగా.. పెళ్లికి ఇంకా ఇద్దరు ఉన్నారు. అయితే.. ఇటీవల కనకయ్య మూడో కూతురు రేణుక.. తనకు పెళ్లి చేయాలని కోరింది. అక్క కన్నా తనకే ముందు పెళ్లి చేయాలని పట్టుబట్టింది. అయితే... అందుకు తండ్రి అంగీకరించలేదు.

పెద్ద కుతురు వివాహం చేయక ముందే నీ వివాహం ఎలా చేస్తామని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన యువతి సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు పెట్టుకుని ఆత్మహుతి చేసుకుంది. మంటలు చేలరేగడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకునే సరికి రేణుక పూర్తిగా కాలిపోయి మృతి చెందిన్నట్లు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?