కార్మికులకు లాభాల్లో వాటా ఏది.. సింగరేణి యాజమాన్యంపై శ్రీధర్ బాబు ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 22, 2022, 2:23 PM IST
Highlights

సింగరేణి యాజమాన్యంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
 

సింగరేణి కార్మికులకు 35 శాతం లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. గురువారం మంథనిలో 73 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు లాభాల వాటాపై స్పష్టమైన ప్రకటన చేయలేదని మండిపడ్డారు. దీనిపై కార్మికులు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో ప్రొడక్షన్ ఎంత వచ్చింది, ఖర్చు ఎంత అయిందని వెల్లడించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ALP మైన్‌లో విదేశాల నుంచి కొనుగోలు చేసిన నాసిరకం మెషిన్ల వల్లే ALP నష్టాల్లోకీ వెళ్ళిందని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతి ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. 

ALso Read:సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో 'ఛలో హైదరాబాద్' కు సిద్దమే..: శ్రీధర్ బాబు హెచ్చరిక

ఇకపోతే... తమ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ఆందోళనలకు శ్రీధర్ బాబు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీ3 జీఎం కార్యాలయం ముందు ఈ నెల 19న సింగరేణి కార్మికులు చేపట్టిన ఆందోళనలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై, వారిని రాజకీయాల కోసం వాడుతున్నారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హత్యలు, దోపిడీలు చేసేవారిని పట్టుకోవాల్సిన పోలీసులు తమ సమస్యల పరిష్కారానికై ప్రజలు చేపట్టే ధర్నాలు, ఆందోళనలను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. 

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ ఆదేశాలను సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు. కోర్టు ఆదేశాలమేరకు కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేసారు. కోల్ ఇండియాలో మాదిరిగానే సింగరేణిలోనూ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు అందించాలని కోరారు.

click me!