కారణమిదీ:కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య ఫిర్యాదు

By narsimha lode  |  First Published Jul 17, 2023, 2:30 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ పై  కాంగ్రెస్ ఎమ్మెల్యే  పొడెం వీరయ్య  ఇవాళ పోలీసులకు ఫిర్యాదు  చేశారు.



భద్రాచలం: తెలంగాణ సీఎం కేసీఆర్ పై  కాంగ్రెస్ ఎమ్మెల్యే  పొడెం వీరయ్య  సోమవారంనాడు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గోదావరి నది వరదల నుండి భద్రాచలం పట్టణాన్ని రక్షించేందుకు అవసరమైన  నిధులు, చర్యలు తీసుకొంటామని గత ఏడాదిలో  తెలంగాణ సీఎం కేసీఆర్  ఇచ్చారని ఆయన గుర్తు  చేశారు.  అయితే ఇంతవరకు  ఈ హామీని అమలు చేయలేదని   వీరయ్య గుర్తు చేశారు.  ఈ హామీ అమలు చేయని  సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ  భద్రాచలం పోలీసులకు  వీరయ్య ఫిర్యాదు  చేశారు. 

గత ఏడాది జూలై మాసంలో  గోదావరి నదికి భారీగా వరద వచ్చింది. ఈ వరద కారణంగా  భద్రాచలం  వద్ద గోదావరి నది పోటెత్తింది.  భద్రాచలం పట్టణానికి రక్షణగా ఉన్న కరకట్టను మరింత విస్తరించనున్నట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చారు.   

Latest Videos

గత ఏడాది జూలై  17న తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాచలంలో పర్యటించారు. భద్రాచలం పట్టణాన్ని  గోదావరి వరద నీటి నుండి రక్షించేందుకు  అవసరమైన ప్రాంతాల్లో కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని కూడ హామీ ఇచ్చారు.   అయితే  ఈ హామీ ఇచ్చి  ఏడాది దాటినా కూడ  ఇంతవరకు  పనులు ప్రారంభం కాలేదని   ఎమ్మెల్యే  వీరయ్య  గుర్తు  చేస్తున్నారు. ఎమ్మెల్యే  ఇచ్చిన  హామీ  నెరవేరనందుకు గాను  భద్రాచలం పోలీసులకు  వీరయ్య ఫిర్యాదు  చేశారు. 

గత ఏడాది జూలై  మాసంలోనే  గోదావరికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. అయితే  ఈ ఏడాది మాత్రం  గోదావరితో పాటు  కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు లేవు.దీంతో  ఈ రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టులు అడుగంటిపోయాయి.నైరుతి రుతుపవనాలు  ఆలస్యంగా  ప్రవేశించాయి.  రుతుపవనాల  ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  కానీ దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో ఆశించిన  స్థాయిలో వర్షాలు లేవు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడ  సాధారణ వర్షపాతం కూడ జూన్ లో నమోదు కాలేదు.  ఈ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని  వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ  ఇప్పటివరకు సరైన వర్షాలు కురవలేదు. 


 


 

click me!