రూ.2 వేల కోట్లు ఇస్తే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం

Siva Kodati |  
Published : Jul 25, 2021, 08:10 PM IST
రూ.2 వేల కోట్లు ఇస్తే... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం

సారాంశం

రూ.2 వేల కోట్లు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వట్లేదని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీ. కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.. మునుగోడు నియోజకవర్గానికి రూ.2 వేల కోట్లు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వట్లేదని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే నిధులిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌లో అన్ని ఎస్సీ కుటుంబాలకు నిధులు ఇస్తున్నారని... ఇతర చోట్ల 100 కుటుంబాలకే ఇస్తామనడం సబబా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. 

తెలంగాణ పిసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన నేపథ్యంలో కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసుకు భవిష్యత్తు లేదని తాను గతంలో మాట్లాడిన విషయం వాస్తవమేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రెండేళ్లుగా తాను కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించిందని ఆయన అన్నారు. తాను పార్టీపై విమర్శలు చేయబోనని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడబోనని ఆయన చెప్పారు. 

Also Read:రెండేళ్లు కాంగ్రెసుకు దూరం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సరైన నాయకత్వం లేకపోవడం వల్లనే కాంగ్రెసు పార్టీ ఓడిపోతూ వచ్చిందని ఆయన అన్నారు. తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.  అధిష్టానం తప్పుడు నిర్ణయాల వల్ల రెండుసార్లు అధికారంలోకి రాలేకపోయిందని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్