తెలంగాణ ప్రజలకు అభినందనలు: రామప్పకు యునెస్కో గుర్తింపుపై మోడీ స్పందన

Siva Kodati |  
Published : Jul 25, 2021, 05:59 PM ISTUpdated : Jul 25, 2021, 06:00 PM IST
తెలంగాణ ప్రజలకు అభినందనలు: రామప్పకు యునెస్కో గుర్తింపుపై మోడీ స్పందన

సారాంశం

వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. 

తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా వైభవానికి రామప్ప ఆలయం ప్రతీక అని ప్రధాని చెప్పారు. అలాగే ఈ ఆలయాన్ని పర్యాటకులు సందర్శించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. 

Also Read:రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం.. ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు

ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా.. మనదేశం నుంచి 2020కి గాను రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల నుంచి వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డుల్లోకెక్కింది. ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ 1213లో నిర్మించిన రామప్ప ఆలయాన్ని.. శిల్పి రామప్ప పేరుతోనే పిలుస్తున్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Flood Alert : తెలంగాణకు పొంచివున్న వరద ముప్పు... ఆస్తి, ప్రాణనష్టం తప్పదా?
భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు | Bonalu 2026 | Asianet News Telugu