సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ: ఆ డిమాండ్లు పరిష్కరించకపోతే 9న దీక్ష చేస్తా

Published : Jun 03, 2020, 01:25 PM ISTUpdated : Jun 03, 2020, 01:28 PM IST
సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ: ఆ డిమాండ్లు పరిష్కరించకపోతే 9న దీక్ష చేస్తా

సారాంశం

 తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం నాడు లేఖ రాశాడు. ఆరు అంశాలను పరిష్కరించాలని కోరుతూ ఆ లేఖలో జగ్గారెడ్డి కోరారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం నాడు లేఖ రాశాడు. ఆరు అంశాలను పరిష్కరించాలని కోరుతూ ఆ లేఖలో జగ్గారెడ్డి కోరారు.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవాలని ఆ లేఖలో సీఎంను కోరాడు జగ్గారెడ్డి. ఈ నెల 8వ తేదీ లోపుగా తాను ప్రస్తావించిన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 9వ తేదీన దీక్ష చేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

బుధవారం నాడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరు అంశాలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు జగ్గారెడ్డి లేఖ రాశాడు. తాను లేఖలో ప్రస్తావించిన డిమాండ్లను పరిష్కరించాలని కోరాడు. 

also read:నిమ్స్‌లో కరోనా కలకలం: నలుగురు వైద్యులు, ముగ్గురు ల్యాబ్ సిబ్బందికి కరోనా

ఈ నెల 8వ తేదీ లోపుగా ఈ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి గడువు ఇచ్చాడు.  ఈ నెల 9వ తేదీన ఒక్క రోజు దీక్ష చేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు.ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. 

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సీఎం ను డిమాండ్ చేశారు.ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆయన సీఎంను కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని ఆయన కోరారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?