కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా:జగ్గారెడ్డి సంచలనం

Published : Jun 09, 2019, 12:24 PM ISTUpdated : Jun 09, 2019, 12:27 PM IST
కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా:జగ్గారెడ్డి సంచలనం

సారాంశం

2004లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను  కాంగ్రెస్‌లో చేర్చుకోవడం తప్పేనని  సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.  

హైదరాబాద్: 2004లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను  కాంగ్రెస్‌లో చేర్చుకోవడం తప్పేనని  సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం నాడు  ఆయన పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆ రోజు తాను కాంగ్రెస్‌ పార్టీలో వెళ్లడం తప్పేనని ఆయన ఒప్పుకొన్నారు.  ప్రస్తుతం సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడం కూడ తప్పేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్లడం వెనుక డబ్బుల కోసమేననే ప్రచారం సాగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  టీఆర్ఎస్‌‌లోకి వెళ్తే డబ్బుల కోసమేననే ప్రచారంపై ఆయన స్పందించారు.  డబ్బులు తీసుకొని పార్టీలు మారడాన్ని ఆయన తప్పుబట్టారు. జగ్గారెడ్డిని  ఎవరూ కొనలేరని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం