నావద్ద కేసీఆర్ ను గద్దెదించే మెడిసిన్... కామెడీ కాదు సీరియస్: జగ్గారెడ్డి సంచలనం

By Arun Kumar PFirst Published Jun 7, 2021, 3:59 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పై కూడా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించే మెడిసిన్ తన వద్ద వుందంటూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి)సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కామెడీగానో, సంచలనం కోసమో ఇలా మాట్లాడటం లేదని... సీరియస్ గానే మాట్లాడుతున్నానని అన్నారు.  

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పై కూడా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపిక జాబితాలో తన పేరు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పిసిసి చీఫ్ పదవిని చేపట్టడానికి తాను సంసిద్దంగా వున్నా... అధినాయకత్వం వరకు తన పేరు వెళ్లలేదన్నారు. అందుకు మాణిక్యం ఠాగూరే కారణమని ఆరోపించారు.

read more  రేవంత్‌రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారు: ఉత్తమ్‌కి వీహెచ్ లేఖ

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతమున్న బలమైన నాయకుల్లో తానూ ఒకడినని... ఆ విషయాన్ని ఠాగూర్ గుర్తించడం లేదన్నారు. రాజకీయంగా కేసీఆర్్ ను ఎదుర్కోవడం తనతోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే కేసీఆర్‌ను అడ్డగించిన చరిత్ర తనదని జగ్గారెడ్డి గుర్తుచేశారు. 

పిసిసి చీఫ్ గా ఎవరికి అవకాశం ఇచ్చినా క్రమశిక్షణ గల నాయకుడిగా కట్టుబడి వుంటానని జగ్గారెడ్డి తెలిపారు. అయితే సమర్ధుడయిన వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని సూచించారు. అయితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా ప్రచారాలు చేస్తే తన రియాక్షన్ సీరియస్ గా వుంటుందని జగ్గారెడ్డి హెచ్చరించారు. 
 

click me!