కోవర్ట్ అంటున్నారు.. ఇక పార్టీలో వుండలేను, త్వరలోనే కాంగ్రెస్‌కు రాజీనామా: సోనియా, రాహుల్‌లకు జగ్గారెడ్డి లేఖ

Siva Kodati |  
Published : Feb 19, 2022, 02:41 PM ISTUpdated : Feb 19, 2022, 03:14 PM IST
కోవర్ట్ అంటున్నారు.. ఇక పార్టీలో వుండలేను, త్వరలోనే కాంగ్రెస్‌కు రాజీనామా: సోనియా, రాహుల్‌లకు జగ్గారెడ్డి లేఖ

సారాంశం

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi) , ఎంపీ రాహుల్ గాంధీలకు (raghul gandhi) టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ (jagga reddy) రాశారు. త్వరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని లేఖలో జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi) , ఎంపీ రాహుల్ గాంధీలకు (raghul gandhi) టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ (jagga reddy) రాశారు. ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్‌లో లేనట్లేనని అన్నారు. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని జగ్గారెడ్డి  పేర్కొన్నారు. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని జగ్గారెడ్డి గుర్తుచేశారు. త్వరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని లేఖలో జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

పార్టీ వీడినా గాంధీ కుటుంబంపై గౌరవం తో ఉంటానని.. పార్టీలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కోవర్ట్ అని కొందరు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకనే రాజీనామా చేసి ప్రజల్లో  స్వతంత్రంగా సేవ చేస్తానని ఆయన చెప్పారు. పార్టీలో ఎవ్వరు కోవర్టులో అధిష్టానం  గుర్తించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 2017లో ఎవ్వరూ అధినేత రాహుల్ గాంధీ సభ పెట్టడానికి ముందుకు రాకుంటే తాను కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించానని...  ఆ సభ నుండి పార్టీ రాష్ట్రంలో బలపడింది.. పార్టీ కోసం కష్టపడిన తానా కోవర్టుని... సభను నిర్వహించకుండా మౌనంగా ఉన్న నేతలా కోవర్టులు...? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 

ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరు అభ్యర్థులు పెట్టకుంటే  తాను మెదక్ జిల్లా నుండి అభ్యర్ధిని నిలబెట్టానన్నారు. కోట్లు ఖర్చు పెట్టి  పార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా పరువు నిలిపానని ఆయన తెలిపారు. పార్టీ సీనియర్లు ఎవ్వరు కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారు... ఎవరు కోవర్టులు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడువేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్ళు కోవర్టులా....? తానా అని ఆయన నిలదీశారు. గాంధీ కుటుంబంపై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండించింది తానేనని జగ్గారెడ్డి గుర్తుచేశారు. మరి పార్టీలో పదవులు అనుభవిస్తూ.. స్పందించకుండా మౌనంగా ఉన్నవాళ్లు కోవర్టులా అనేది అధిష్టానం గుర్తించాలని ఆయన హితవు పలికారు. 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu
Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న