బీజేపీ రక్తం తాగే పులిలాంటిది: ఈ నాలుగు అంశాలపై చర్చకు సిద్ధమా.. బండి సంజయ్‌కి జగ్గారెడ్డి సవాల్

Siva Kodati |  
Published : Sep 01, 2021, 06:00 PM IST
బీజేపీ రక్తం తాగే పులిలాంటిది: ఈ నాలుగు అంశాలపై చర్చకు సిద్ధమా.. బండి సంజయ్‌కి జగ్గారెడ్డి సవాల్

సారాంశం

బీజేపీ రక్తం తాగే పులిలాంటి స్వభావం గలదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు  సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పైకి గోవులా కనపడుతూనే హిందువులను రెచ్చగొడుతుందని చెప్పారు. మీకు మతాల మధ్య గొడవలు కావాలా? లేక ప్రజలకు మేలు జరగడం కావాలా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. బండి సంజయ్ హిందుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల కోసం తాను లేవనెత్తే నాలుగు ప్రశ్నలకు చర్చకు సిద్ధమా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న 80 శాతం మంది హిందువుల కోసం పని చేస్తానని చెప్పావ్... హిందువుల కోసం మోడీతో మాట్లాడి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించగలవా? తెలంగాణలోని పేద హిందువులకు రూ. 15 లక్షలు ఇప్పించగలవా? నిజాం భూములు తీసుకుని హిందువులకు ఇస్తామని చెప్పగలవా? 80 శాతం మంది హిందువుల కోసం మాట మీద నిలబడగలవా? అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు.
 
బీజేపీ రక్తం తాగే పులిలాంటి స్వభావం గలదని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పైకి గోవులా కనపడుతూనే హిందువులను రెచ్చగొడుతుందని చెప్పారు. మీకు మతాల మధ్య గొడవలు కావాలా? లేక ప్రజలకు మేలు జరగడం కావాలా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!