విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్.. తెలంగాణలో కాంగ్రెస్ మరో ప్రజాకర్షక హామీ..!

By Sumanth Kanukula  |  First Published Sep 30, 2023, 9:55 AM IST

తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీలకు కూడా ప్రకటించింది. అలాగే తాము అధికారంలో వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.


తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీలకు కూడా ప్రకటించింది. అలాగే తాము అధికారంలో వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని  వర్గాలను ఆకర్షించే విధంగా హామీలను సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల పరిశీలనలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలోనే విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం వంటి వాగ్దానాలను కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ‌లో చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో శ్రీధర్‌ బాబు నేతృత్వంలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్‌, ప్రసాద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రాతినిధ్యాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు విడుదల చేసే పార్టీ మేనిఫెస్టోలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక పథకంను చేర్చాలని నిర్ణయించింది.

Latest Videos

శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు హామీలతో పాటు అదనపు హామీలు ఉంటాయని తెలిపారు.  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకువస్తామని చెప్పారు. ఇక, తెలంగాణ ప్రజలు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకునేందుకు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాటిని చేర్చేందుకు చర్యలు చేపట్టేందుకు కమిటీ అక్టోబర్ 2 నుంచి జిల్లాల్లో పర్యటించనుంది. తొలిరోజు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ పర్యటన ఉండనుంది. 

click me!