కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా: దసరా తర్వాత విడుదల

By narsimha lode  |  First Published Oct 22, 2023, 12:09 PM IST

కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా దసరా తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.  ఈ మేరకు  ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. 



హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను  దసరా పర్వదినం తర్వాత విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది.  ఈ నెల  25 లేదా 26న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది.ఈ సమావేశంలో కాంగ్రెస్ రెండో జాబితాకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.

ఈ నెల 15న తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.  తొలి జాబితాలో 55 మందికి అవకాశం కల్పించింది.  తొలి జాబితాలో 58 మందికి చోటు కల్పిస్తామని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ ప్రకటించారు. కానీ, తొలి జాబితాలో 55 మందికే చోటు దక్కింది.  లెఫ్ట్ పార్టీలకు  రెండేసీ సీట్లను కేటాయించేందుకు ఆ పార్టీ  సానుకూలంగా ఉంది.  సీపీఐకీ చెన్నూరు, కొత్తగూడెం సీట్లను కేటాయించనుంది.  మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని  సీపీఎంకు కేటాయించనుంది.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా అసెంబ్లీ స్థానాన్ని  సీపీఎంకు కేటాయించాలని  కాంగ్రెస్ భావిస్తుంది. అయితే  కాంగ్రెస్ నుండి  ప్రతిపాదిస్తున్న అసెంబ్లీ సీట్ల జాబితాకు సంబంధించి తమకు అధికారిక సమాచారం రాలేదని సీపీఎం చెబుతుంది.  లెఫ్ట్ పార్టీల నేతలతో ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపే అవకాశం ఉంది.

Latest Videos

undefined

లెఫ్ట్ పార్టీలకు సీట్ల సర్ధుబాటు కారణంగా నాలుగు స్థానాలను మినహాయిస్తే మిగిలిన స్థానాల్లో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ను విడుదల చేసే అవకాశం ఉంది.  రెండో జాబితాలోనే మిగిలిన అన్ని స్థానాలకు చోటు దక్కే అవకాశం ఉంది.

అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసేందుకు గాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు  ఇప్పటికే న్యూఢీల్లీకి చేరుకున్నారు. నిన్న  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది.ఇవాళ కూడ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేయనున్నారు. 

ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్న స్థానాలు రెండో జాబితాలో చోటు దక్కనుంది.  పార్టీ టిక్కెట్టు దక్కని అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం  జానారెడ్డి  నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఓ కమిటీని కూడ ఏర్పాటు చేసింది.  

also read:సీపీఐ, సీపీఎంలకు రెండేసీ స్థానాలు: లెఫ్ట్ పార్టీలతో నేడు కాంగ్రెస్ నేతల భేటీ

ఈ దఫా ఎన్నికల్లో  తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. కర్ణాటక ఫార్మూలాను అమలు చేస్తుంది. ఇప్పటికే  తొలి విడత బస్సు యాత్రను కాంగ్రెస్ పూర్తి చేసింది. ఇంకా రెండు దఫాలుగా బస్సు యాత్ర నిర్వహించనుంది.  రెండో జాబితా తర్వాత  ఎన్నికల మేనిఫెస్టో  విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ  ఈ మేరకు కసరత్తు చేస్తుంది.

click me!