మహాకూటమి ఎఫెక్ట్: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం

By narsimha lodeFirst Published Oct 10, 2018, 11:16 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 18వ, తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.  


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 18వ, తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.  కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్ భక్త చరణ్ దాస్‌కు మరో రెండు రోజుల గడువును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా  కాంగ్రెస్ పార్టీ  స్క్రీనింగ్ కమిటీని కోరినట్టు సమాచారం.

రాష్ట్రంలో ఆయా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే  అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు  రెండు రోజులుగా కసరత్తు  చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలోని 39 సెగ్మెంట్లలో  ఒక్క అభ్యర్థి పేరును  ప్రతిపాదించారు. ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా వీరికే టిక్కెట్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది.

అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు నిర్వహిస్తున్నారు.  ఈ మేరకు  మరో రెండు రోజుల గడువును  భక్త చరణ్ దాస్ ను కోరినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ నెల 13,14 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ హైపవర్  కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు.ఈ సమావేశం  తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు స్క్రీనింగ్ కమిటీకి జాబితాను విడుదల ఇవ్వనున్నారు.

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితాను  పరిశీలించిన తర్వాత తుది జాబితాకు రూపకల్పన చేయనుంది.  అనుకొన్న షెడ్యూల్ ప్రకారంగా ఇవన్నీ పూర్తైతే కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  అక్టోబర్ 18వ తేదీన  అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

వాస్తవానికి అక్టోబర్ 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావించింది. అయితే  అన్ని నియోజకవర్గాల్లో  అభ్యర్థుల జాబితా రెడీ కాలేదు.అంతేకాదు మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు కూడ  పూర్తి కాలేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని  రెండు రోజుల  కుంతియా భక్తచరణ్ దాస్‌ను కోరినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ తొలి జాబితా రెడీ: 39 మంది అభ్యర్థులు వీరే

 

click me!