కాంగ్రెస్ లో పొత్తుల చిచ్చు... ఉత్తమ్ ఇంటిముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా

By Arun Kumar PFirst Published Sep 11, 2018, 6:04 PM IST
Highlights

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణలోని ప్రతిపక్షాలన్ని ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తెలుగు దేశం మరియు సిపిఐ పార్టీలతో పొత్తుకు సిద్దమైంది. అయితే సీట్ల సర్దుబాటులో మాత్రం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పేలా లేవు.  తమ నాయకుడికి కాకుండా పొత్తుల్లో వేరే పార్టీకి టికెట్ కేటాయించారన్న ప్రచారం జరగడంతో ఓ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా ఉత్తమ్ ఇంటిముందే ధర్నాకు దిగారు. ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.  

వివరాల్లోకి వెళితే... భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు ఏకంగా టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఇందుకు కారణం...తమ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు ను కాదని పొత్తుల్లో కొత్తగూడెం సీటు సిపిఐకి కేటాయించారని ప్రచారం జరగడం. ఈ ప్రచారం నిజమవుతుందేమో అన్న అనుమానంతో వనమా అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో ఏకంగా కొందరు వనమా అనుచరులు కొన్ని వాహనాల్లో హైదరాబాద్ కు తరలి వచ్చి ఉత్తమ్ ఇంటిముందు ధర్నాకు దిగారు. తమ నాయకుడిని కాదని నిజంగానే ఈ సీటు సిపిఐ కి కేటాయిస్తే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని వారు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని గట్టిగా హెచ్చరించారు.

అసలు ఇంకా పొత్తులపై స్పష్టతే రాలేదు. సీట్ల సర్దుబాటు ఊసే లేదు. అలాంటిది కేవలం ఊహాగానాల నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో భవిష్యత్ లో సీట్ల కేటాయింపులో మరెన్ని తలనొప్పుల వస్తాయో అని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. అందువల్ల ఈ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ముఖ్య నాయకులకు ముందుగానే సమాచారం అందించాలని సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 

click me!