ఉత్తమ్ కు జెడ్ ప్లస్, కోమటిరెడ్డికి 4+4 :భద్రతపై డీజీపీని కలిసిన కాంగ్రెస్

By Nagaraju TFirst Published Oct 30, 2018, 3:25 PM IST
Highlights

ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ నేతలకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ టీ కాంగ్రెస్ నేతలు డీజీపీని కలిశారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జెడ్‌ కేటగిరి భద్రతతోపాటు, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం, ఎస్కార్ట్‌ కల్పించాలని డీజీపీని కోరారు. 
 

హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ నేతలకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ టీ కాంగ్రెస్ నేతలు డీజీపీని కలిశారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జెడ్‌ కేటగిరి భద్రతతోపాటు, బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం, ఎస్కార్ట్‌ కల్పించాలని డీజీపీని కోరారు. 

పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 4+4 సెక్యూరిటీ కల్పించాలని, భట్టి విక్రమార్కకు ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని పెంచాలని డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. అలాగే విజయశాంతి, మధుయాష్కిగౌడ్, గూడూరు నారాయణ రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌లకు కూడా  సెక్యూరిటీ కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
 
విధివిధానాలకు అనుగుణంగా నేతలకు భద్రతను కొనసాగిస్తామని డీజీపీ కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి కేంద్ర బలగాలకు చెందిన 4+4 సిబ్బందితో భద్రత కల్పించాలని సిఈవోని, రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఈ భద్రతను కొనసాగించాలని సూచించింది. 

click me!