చంచల్‌గూడలో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు.. రాహుల్‌ ఒక్కరినైనా అనుమతించండి: జైళ్ల శాఖ డీజీకి రేవంత్ విజ్ఞప్తి

Siva Kodati |  
Published : May 05, 2022, 04:20 PM IST
చంచల్‌గూడలో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు.. రాహుల్‌ ఒక్కరినైనా అనుమతించండి: జైళ్ల శాఖ డీజీకి రేవంత్ విజ్ఞప్తి

సారాంశం

చంచల్‌గూడ జైల్లో వున్న విద్యార్ధి నేతలను కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ కలిసేందుకు అనుమతించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు తెలంగాణ జైళ్ల శాఖ డీజీని కోరారు. 8 మంది ఎన్ఎస్‌యూఐ విద్యార్ధులను 50 మంది ఒకేసారి కలిసే అవకాశం వుందని చెప్పారు. 

చంచల్‌గౌడ జైల్లో వున్న విద్యార్ధి నాయకులను రాహుల్ గాంధీ (rahul gandhi) కలిసేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీని టీ.కాంగ్రెస్ (congress) నేతలు కలిశారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో లా అండ్ ఆర్డర్ డీజీనీ కలిశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీకి ఓయూలో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరేందుకే విద్యార్ధి నేతలు వెళ్లారని చెప్పారు. అనుమతి ఇవ్వకపోతే పర్వాలేదని.. కానీ అక్రమ కేసులు పెట్టి బల్మూర్ వెంకట్ సహా 18 మంది విద్యార్ధి నేతలను నిర్బంధించారని రేవంత్ ఆరోపించారు. 

చంచల్‌గూడ జైలులో వున్న విద్యార్ధులను పరామర్శించాలని రాహుల్‌ను తాము కోరామని .. దీనికి ఆయన సమ్మతించారని రేవంత్ చెప్పారు. విద్యార్ధులకు భరోసా ఇచ్చేందుకు చంచల్‌గూడలో రాహుల్ గాంధీ పర్యటించాలని భావించారని ఆయన పేర్కొన్నారు. మే 7న రాహుల్ చంచల్‌గూడ జైలుకు వస్తారని.. ఇందుకు అనుమతి ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌ను కోరామన్నారు. కానీ అందుకు ఆయన అనుమతి ఇవ్వకపోగా.. జైళ్ల శాఖ డీజీని కలవాలని సూచించారని రేవంత్ వెల్లడించారు. 

75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంత నిరంకుశంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఆయన దుయ్యబట్టారు. మరణశిక్షపడ్డ ఖైదీలను కూడా వాళ్ల సంబంధీకులు కలిసేందుకు అనుమతులు దొరుకుతాయని రేవంత్ చెప్పారు. అలాంటిది ఇక్కడ విద్యార్ధులపై అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడితే.. వారిని పరామర్శించాలని రాహుల్, మాణిక్యం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు భావించారని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చి.. ములాఖత్‌లకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు. 18 మంది ఎన్ఎస్‌యూఐ విద్యార్ధులను 50 మంది ఒకేసారి కలిసే అవకాశం వుందని చెప్పారు. 

ఇకపోతే.. పోలీసుల బందోబస్తు లేకుండా రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి TRS నేతలకు ఉందని Revanth Reddy విమర్శించారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా మంత్రి Harish Rao పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి హరీష్ రావు వ్యవసాయ పొలంలో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు హరీష్ రావు చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలు ఉన్న ఫోటోను రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నిన్న పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలో Rahul Gandhi  తెలంగాణ రాస్ట్రంలో ఎందుకు పర్యటిస్తున్నావని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనానికి సంబంధించిన పేపర్ కటింగ్ ను కూడా రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ కు జత చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu