తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విబేధాలు... క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఇలాకాలోనే ఇదీ పరిస్థితి... (వీడియో)

Published : Aug 17, 2023, 12:32 PM IST
తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విబేధాలు... క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఇలాకాలోనే ఇదీ పరిస్థితి... (వీడియో)

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి వర్గవిబేధాలు బయటపడ్డాయి. వనపర్తి, మహబూబాబాద్ జిల్లాల్లో కేంద్ర పరిశీలకుల ముందే కాంగ్రెస్ నాయకులు తన్నుకున్నారు. 

వనపర్తి : కాంగ్రెస్ పార్టీలో అంతర్గల ప్రజాస్వామ్యం మరీ ఎక్కువగా వుంటుందనే విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకుల మధ్య విబేధాలు అప్పుడప్పుడు మాటలయుద్దానికి, మరీ ముదిరితే గొడవలకు దారితీస్తుంటాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ ఆదిపత్య పోరు మరీ ఎక్కువగా వుంటుంది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్లకు మధ్య ఎప్పుడూ నడిచే పంచాయితే ఇందుకు నిదర్శనం. అయితే ఈ పరిస్థితి రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలోనూ వుందని ఇటీవల సంఘటనలు బయటపెడుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. 

నాగర్ కర్నూల్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బూత్ స్థాయి కమిటీల సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి వర్గీయుల మధ్య మాటామాటా పెరిగి పరస్పర దాడులకు దారితీసింది. నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జీ, కర్ణాటక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పివి మోహన్ ఎదుటే ఇరువర్గాలు గొడవపడ్డాయి. ఈ సమావేశంలోనే వున్న చిన్నారెడ్డి, శివసేనారెడ్డి తమ అనుచరులను నిలువరించే ప్రయత్నం చేయకపోవడంతో రసాభాస కొనసాగి సమావేశం అర్ధాంతరంగా ముగించారు. 

వీడియో

తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా వున్న చిన్నారెడ్డి తన అనుచరులను క్రమశిక్షణలో పెట్టుకోలేకపోతున్నాడని శివసేనారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి  సమీష్టిగా పనిచేయాలని తాము ప్రయత్నిస్తే చిన్నారెడ్డి మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. వనపర్తి నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు విషయంలోనే ఇలాగే వ్యవహరించారని... చివరకు రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సమాచారం ఇవ్వలేదని శివసేనారెడ్డి వర్గీయులు తెలిపారు.

చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాకుండా స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారని శివసేనారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఇలా మాజీ మంత్రి తీరును వ్యతిరేకిస్తూ శివసేనారెడ్డి వర్గం... వీరికి పోటీగా చిన్నారెడ్డి వర్గం నినాదాలు చేస్తూ గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లగా తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో  మాజీ ఎంపీ మల్లు రవి వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది.

rRead More  కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీని వదిలిపోవాలి .. నాకు ఏ పదవి వద్దు : కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

చిన్నారెడ్డి, శివసేనారెడ్డి కూడా తమ వర్గీయులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించపోవడంతో దాదాపు గంటసేపు ఈ గందరగోళం నెలకొంది. చివరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి తన అనుచరులను తీసుకుని సమావేశం నుండి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ పరిస్థితుల్లో సమావేశాన్ని కొనసాగించలేక వాయిదా వేసారు. 

ఇదిలావుంటే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నాయకుల విబేధాలు బయటపడ్డాయి. డిసిసి అధ్యక్షుడు భరత్ చంద్ రెడ్డి, మాజీ ఎంపీ బలరాం నాయక్ వర్గీయులు కేంద్ర పరిశీలకుడు, కర్ణాటక మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్ ఎదుటే దాడులు చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?