మాస్క్ కే పీచే మతలబ్ క్యా హై?.. తెలంగాణ రాములమ్మ సంకేతాలు

Bukka Sumabala   | Asianet News
Published : Dec 01, 2020, 04:21 PM ISTUpdated : Dec 01, 2020, 04:23 PM IST
మాస్క్ కే పీచే మతలబ్ క్యా హై?.. తెలంగాణ రాములమ్మ సంకేతాలు

సారాంశం

కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి ప్రముఖ నటి విజయశాంతి బంజారాహిల్స్‌ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చిన విజయశాంతి మొహానికి పెట్టుకున్న మాస్క్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి ప్రముఖ నటి విజయశాంతి బంజారాహిల్స్‌ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు వేయడానికి వచ్చిన విజయశాంతి మొహానికి పెట్టుకున్న మాస్క్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాషాయరంగు మాస్క్, నుదిటిన శిలువ గుర్తులాంటి బొట్టుతో రాములమ్మ కనిపించడం చర్చకు దారి తీసింది. గత కొంతకాలంగా విజయశాంతి పార్టీ మారతారన్న విషయం మీద చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత విజయశాంతి సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ సినిమాలో నటించారు. ఆ సమయంలో ఇక, వరుస సినిమాలు చేస్తారనే చర్చ సాగినా.. ఆమె మాత్రం అంగీకరించలేదు. ఈ క్రమంలో  గత కొంతకాలంగా వరుసగా ఆమెను బీజేపీ నేతలు కలవడంతో ఆమెను పార్టీలోకి ఆహ్వానించారనే టాక్ వినిపించింది.

ఇది సాధారణ భేటీగానే కొందరు వ్యాఖ్యానించగా... కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమె పార్టీలోనే కొనసాగుతారని చెబుతూ వస్తున్నారు. ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని టాక్ నడిచింది.

ఆ తర్వాత  గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన నడ్డాను ఆమె కలిశారని.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గుసగుసలు వినిపించాయి. అయితే ఇవేవీ జరగలేదు. కానీ, బీజేపీ నేతలపై వస్తున్న విమర్శలపై మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వస్తున్నారు రాములమ్మ.

కేసీఆర్ పై విరుచుకుపడుతూ వరుస ట్వీట్లతో, ఎప్పుడూ వార్తల్లో నిలిస్తూ వస్తున్నారామె. ఈ నేపధ్యంలో ఈ రోజు ఓటు వేయడానికి వచ్చిన రాములమ్మ కాషాయం రంగులో ఉన్న మాస్క్‌తో దర్శనమిచ్చారు. దీంతో.. రాములమ్మ ఇలా.. తాను బీజేపీలో చేరడం ఖాయం అని సిగ్నల్ ఇచ్చిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. 

ఇక రాములమ్మ పెట్టుకున్న బొట్టు కూడా కాస్త చర్చకు దారి తీసింది. ఎప్పుడూ అడ్డం నిలువు, అది కూడా నుదిటికి పై భాగంలో పెట్టుకోవడం ఇది దేనికి సిగ్నలో తెలియక నెటిజన్లు సతమతమవుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu