శిశుపాలుడి కంటే ఎక్కువ తప్పులు: కేసీఆర్ పై విజయశాంతి

By narsimha lodeFirst Published Jul 24, 2019, 8:04 AM IST
Highlights

కాంగ్రెస్ నేత విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆమె మండిపడ్డారు.
 

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ఆమె మండిపడ్డారు. మున్సిపల్ బిల్లును గవర్నర్ వెనక్కు పంపడంపై విజయశాంతి స్పందించారు.

శిశుపాలుడు చేసిన తప్పుల్ని మించి  కేసీఆర్ సర్కార్ తప్పులు చేస్తోందని  కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. నియంతృత్వ ధోరణితో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొంటున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను విపక్షాలు తప్పుపడుతున్నా కూడ కేసీఆర్ స్పందించడం లేదన్నారు.

ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని జైలుకు పంపుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన విషయాన్ని కాంగ్రెస్ నేత విజయశాంతి గుర్తు చేశారు.కేసీఆర్ సర్కార్ అవలంభించిన విధానాలను హైకోర్టు కూడ తప్పుబట్టిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కొన్నిజీవోలను కూడ రద్దు చేసిందన్నారు.

కేసీఆర్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాలపై వ్యతిరేకంగా నిర్ణయాలు వస్తున్నా కూడ కనీసం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. మున్సిపల్ బిల్లును గవర్నర్ నరసింహన్ వెనక్కి పంపి కేసీఆర్ కు ఊహించని షాకిచ్చారని ఆమె చెప్పారు.

కేసీఆర్ ను ఇంతకాలం పాలు వెనకేసుకొచ్చిన గవర్నర్ కూడ తన వైఖరిని మార్చుకొన్నారని  విజయశాంతి అభిప్రాయపడ్డారు.కేసీఆర్ తన తప్పుల్ని సరిదిద్దుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని విజయశాంతి హెచ్చరించారు.

click me!