విషాదం...ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Published : Jul 24, 2019, 08:01 AM IST
విషాదం...ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

సారాంశం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది. 

ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం ప్రాణాలు విడిచింది.  ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే... మిర్యాలగూడలోని సంతోష్ నగర్ కి చెందిన పారేపల్లి లోకేష్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని లోకేష్ తాగాడు. అనంతరం విషం కలిపిన కూల్ డ్రింక్ ని అతని భార్య(40) , కుమారుడు లోహిత్(14)లతో కూడా తాగించాడు. దీంతో.. వారు మృతి చెందారు. ఆర్థిక సమస్యల కారణంగానే వారు ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్యాయత్నానికి ముందు లోకేష్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ బయటపడింది. ‘క్షమించండి అమ్మానాన్నా. బ్రతికే అర్హత లేదు. నాన్నా దయచేసి ఈ చిన్న అప్పులు తీర్చండి’ అని లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. జీవితంలో స్థిరపడకపోవడంతో తన తమ్ముడు ఎప్పుడూ ఆత్మన్యూనతా భావంతో ఉండేవాడని అతని సోదరుడు చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డారని కన్నీరుమున్నీరయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్