తెలంగాణలో ఫిరాయింపులు ఒప్పేనా?: జగన్‌పై విజయశాంతి

By narsimha lodeFirst Published Apr 28, 2019, 10:51 AM IST
Highlights

 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకోవడంపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తన అభిప్రాయాన్ని చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి విజయశాంతి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకోవడంపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తన అభిప్రాయాన్ని చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటి విజయశాంతి డిమాండ్ చేశారు.  ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం తప్పా... ఒప్పో చెప్పాలని ఆమె కోరారు.

ఏపీలో పార్టీ ఫిరాయింపులపై వైసీపీ పోరాటం చేస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌తో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌లో జగన్ భాగస్వామ్యం కావడం ఏ మేరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరాలంటూ  రెండేళ్లుగా అసెంబ్లీని జగన్ బహిష్కరించారని ఆమె గుర్తు చేశారు. 

పార్టీ ఫిరాయింపులు ఏపీలో తప్పైతే తెలంగాణలో ఎలా ఒప్పువుతాయని ప్రశ్నించారు.  ఈ మేరకు విజయశాంతి శనివారం నాడు ఓ ప్రకటనను విడుదల చేశారు. చట్టసభల్లో స్పీకర్ పదవి చాలా ఉన్నతమైందన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు కూడ లేని రీతిలో రాజ్యాంగాన్ని పొందుపర్చారన్నారు.

స్పీకర్  పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని  రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నా... ఇటీవల అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనవుతున్నారని విమర్శలు రావడం శోచనీయమన్నారు.

హైకోర్టు ప్రశ్నలకు గత అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి జవాబు చెప్పాల్సి ఉందని, ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివా‌స్ రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.


 

click me!