సామాన్యుడికో న్యాయం.. అసదుద్దీన్ కి ఇంకో న్యాయమా.?

By telugu news teamFirst Published Apr 7, 2020, 8:21 AM IST
Highlights

ప్రధాని పిలుపుపై ఎవరైనా అవహేళనగా మాట్లాడితే కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడెలాంటి చర్యలు ఉంటాయని పశ్నించారు. ఈ మేరకు ఆమె సోషల్  మీడియాలో పోస్టులు పెట్టారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... సామాన్యుడికో న్యాయం.. అసదుద్దీన్ కి మరో న్యాయం అన్న చందంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి పేర్కొన్నారు. అసదుద్దీన్.. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కించ పరుస్తూ చేసిన కామెంట్స్ పై విజయశాంతి స్పందించారు. ఈ విషయంలో కేసీఆర్.. అసదుద్దీన్ పై చర్యలు తీసుకుంటారా అని ఆమె ప్రశ్నించారు.

Also Read పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: అసదుద్దీన్ ఓవైసీపై బిజెపి ఎమ్మెల్సీ ఫైర్...

దీప ప్రజ్వలన గురించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల హేళనగా మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా...  దీనిపై విజయశాంతి మండిపడ్డారు. ప్రధాని పిలుపుపై ఎవరైనా అవహేళనగా మాట్లాడితే కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడెలాంటి చర్యలు ఉంటాయని పశ్నించారు. ఈ మేరకు ఆమె సోషల్  మీడియాలో పోస్టులు పెట్టారు.


‘‘దీప ప్రజ్వలన అంశంలో పార్టీల పరంగా రాజకీయ చర్చ ఈరోజు కూడా కొనసాగుతున్నట్లుగా తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. కరోనా మహమ్మారి సమస్యకు సంబంధించి కుల, మతాలకు అతీతంగా ప్రజారోగ్య దృష్టిలో మాత్రమే నేను మొదటి నుంచి నా స్పందనను తెలియజేస్తున్నాను. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పనిచేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను ఖండించడంతో పాటు.. ఇంకా అందుబాటులోకి రాని జమాతే వ్యక్తులను తక్షణమే ప్రభుత్వానికి సహకరించాలని నేను సూచించాను. దీనికి సంబంధించి ఎంఐఎం పార్టీ తరపున పిలుపు ఇస్తారని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊహించారు. అయితే ఈ విషయాన్ని ఆలోచించకుండా... దీపాన్ని ఆరాధించే దేశంలో అత్యధిక ప్రజల మనోభావాలకు సంబంధించిన దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సమర్థించారు. దీనికి సంబంధించి ప్రధాని ఇచ్చిన పిలుపును ఎంఐఎం అధినేత ఓవైసీ అవహేళన చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. మరి గతంలో ఓ ప్రెస్ మీట్‌లో తెలంగాణ సీఎం మాట్లాడుతూ ప్రధాని పిలుపును సోషల్ మీడియాలో అవహేళన చేసిన వారిపై చర్య తీసుకోవాలని డీజీపీ గారిని ఆదేశించారు కదా... గతంలో చెప్పిన విధంగా ఇప్పుడు ఓవైసీ గారిపై ప్రధానిని అవహేళన చేసినందుకు చర్యలు ఉంటాయా?’’ అని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.  

click me!