షర్మిల వైఎస్ కూతురు మాత్రమే.. ఇంకేం కాదు : వి. హనుమంతరావు..

By AN TeluguFirst Published Apr 9, 2021, 3:24 PM IST
Highlights

వైయస్ షర్మిల వైయస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె మాత్రమేనని అంతకు మించి ఏమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన, కరోనాతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతుంటే.. షర్మిల సభకు ఎలా అనుమతిస్తారు? అని డీజీపీ మహేందర్రెడ్డి ని ప్రశ్నించారు. అసలు రోడ్లమీద రోడ్ షోలకు ఎందుకు అనుమతిచ్చారు? ఈ ప్రశ్నలకు డిజిపి సమాధానాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. 

మేము ఎక్కడికి వెళ్ళినా అనుమతి ఇవ్వరు. వాళ్లకు ఒక న్యాయం మాకో న్యాయమా? ఈ విషయంపై మా నేతలు కూడా మాట్లాడాలి. బిజెపి టిఆర్ఎస్ తెలంగాణలో ఉండే ఆంధ్ర ఓట్లను కొల్లగొట్టడానికి ఆడిస్తున్న నాటకమే ఇదంతా. షర్మిల ఏదైనా చేయాలనుకుంటే ఆంధ్రాలో చేసుకోవాలి. విజయమ్మ ఆంధ్రాలో కొడుకు, తెలంగాణలో కూతురు ఉండాలి అని అనుకుంటున్నారా? అని ఒకింత ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. కాగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్లో సంకల్ప సభ మరికాసేపట్లో ప్రారంభంకానుంది.

షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం.. ఢీ కొట్టుకున్నవాహనాలు.. పలువురికి గాయాలు..

ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం 8 గంటలకు  భారీ కాన్వయ్ తో షర్మిల లోటస్ పాండ్ నుండి ఖమ్మం బయలుదేరారు. లక్టీకాపూల్, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ , హయత్ నగర్ కు ఉదయం 9:30 గంటలకు చేరుకొన్నారు. హయత్ నగర్ లో షర్మిలకు వైఎస్ఆర్ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

ఉదయం పదిన్నర గంటలకు  చౌటుప్పల్, మధ్యాహ్నం 12 గంటలకు నకిరేకల్, 12 గంటల 45 నిమిషాలకు సూర్యాపేటలో ఆమెకు ఘనంగా స్వాగతం పలకనున్నారు.  చివ్వెంలో ఆమె మధ్యాహ్న భోజనం కోసం ఆగుతారు.మోతె మండలం నామవరంలో రెండున్నర గంటలకు చేరుకొంటారు. మూడు గంటలకు ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం చేరుకొంటారు. సాయంత్రం 5:15 గంటలకు పెవిలియన్ గ్రౌండ్స్ కు షర్మిల చేరుకొంటారు.

అయితే.. కొత్త పార్టీ ఆవిష్కరణ సభకోసం ఖమ్మం వెడుతోన్న వైయస్ షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు వాహనాలు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. ఖమ్మంలో సాయంత్రం 5గంటలకు వైయస్ షర్మిల సంకల్ప సభకు వెడుతున్న నేపథ్యంలో మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

అటు ఈ సభకు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి భారీగా వైయస్ అభిమానులు తరలివస్తున్నారు. సంకల్పయాత్రకు బయల్దేరే ముందు షర్మిల ఆమె భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తున్నందుకు ఆమె అనిల్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. 

click me!