రేవంత్‌రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారు: ఉత్తమ్‌కి వీహెచ్ లేఖ

Published : Jun 06, 2021, 01:25 PM IST
రేవంత్‌రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారు: ఉత్తమ్‌కి వీహెచ్ లేఖ

సారాంశం

 రేవంత్ రెడ్డి అనుచరులు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: రేవంత్ రెడ్డి అనుచరులు తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.ఆదివారం నాడు కాంగ్రెస్ నేత హనుమంతరావు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశాడు. ఈ  లేఖలో పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. 

also read:మేం కలిసే ఉన్నాం, గొడవల్లేవ్: రేవంత్, కోమటిరెడ్డి మంతనాలు

తనకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని మీ దదృష్టికి తీసుకొచ్చినా కూడ స్పందించలేదన్నారు. ఓ విద్యార్ధి నాయకుడిపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు.రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జీలు లేని విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు.  ఇంచార్జీలు లేని నియోజకవర్గాలకు వెంటనే ఇంచార్జీలను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.  రాష్ట్రంలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జీలను నియమించాలని  ఆయన కోరారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే  అసెంబ్లీలో ఖాళీగా ఉన్న ఇంచార్జీలను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !