దిగ్విజయ్ ఎందుకు సంతృప్తి చెందారో ఆయననే అడగాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..

Published : Dec 24, 2022, 03:28 PM IST
దిగ్విజయ్ ఎందుకు సంతృప్తి చెందారో ఆయననే అడగాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

టీ కాంగ్రెస్‌లో విభేదాలకు తెరపడే  పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో సీనియర్ నేతలంతా  సంయమనం పాటించాలని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కోరారు. అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం ఆ మాటలను పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. 

టీ కాంగ్రెస్‌లో విభేదాలకు తెరపడే  పరిస్థితి కనిపించడం లేదు. టీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధిష్టానం దూత దిగ్విజయ్ సింగ్.. పార్టీలోని ఏ సమస్యపైనైనా అంతర్గతంగా  చర్చించాలని పార్టీ నేతలకు చేతులు జోడించి కోరుతున్నానని  చెప్పారు. తెలంగాణలో సీనియర్ నేతలంతా  సంయమనం పాటించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ లో  సీనియర్లు,  జూనియర్లు అనే ప్రస్తావన సరికాదన్నారు. అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం ఆ మాటలను పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. 

తాజాగా సీనియర్ నేత వీ హనమంతరావు మీడియాతో మాట్లాడుతూ.. దిగ్విజయ్ సింగ్ ఎందుకు సంతృప్తి చెందారో ఆయననే అడగాలని అన్నారు. తమకైతే సంతృప్తి లేదని చెప్పారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ నాయకులకు న్యాయం జరిగినప్పుడే తమకు సంతృప్తి అని అన్నారు. అసలైన కాంగ్రస్సోళ్లకు న్యాయం చేయాల్సిన అసవరం ఉందని దిగ్విజయ్ సింగ్‌కు చెప్పానని అన్నారు. కమిటీలో వేసినవారికి తీసేయకుండా.. పనిచేసిన పాతవారికి కూడా పదవులు ఇవ్వాలని తాను కోరుతున్నానని చెప్పారు. ఎక్కడైనా తాను ఇదే మాట చెబుతానని అన్నారు. 

Also Read: పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాల్సిందే: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ సింగ్ వార్నింగ్

జనసేన, టీడీపీ‌లు కూడా రంగంలోకి దిగుతున్నాయని.. వాటిని కూడా కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉందన్నారు. డ్యామేజ్‌ను కంట్రోల్ చేయకపోతే.. పదవులు దక్కనివారు వేరే తోవ చూసుకుంటారని.. అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu