పార్టీకి విరుద్దంగా పనిచేస్తే మధుయాష్కి‌పై చర్యలు తప్పవు.. మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి

By Sumanth KanukulaFirst Published Dec 24, 2022, 2:49 PM IST
Highlights

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్‌ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీకి విరుద్దంగా పనిచేస్తే మధుయాష్కి‌పై చర్యలు తప్పవని అన్నారు. 

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్‌ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీకి విరుద్దంగా పనిచేస్తే మధుయాష్కి‌పై చర్యలు తప్పవని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారికిపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందేనని అన్నారు. గ్రూపులు సమసిపోయాయని.. అందరం కలిసే పనిచేస్తామని చెప్పారు. 

ఇక, ఇటీవల టీ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీల ప్రకటన పెనుదుమారమే రేపిన సంగతి తెలిసిందే. అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతుందని సీనియర్ నేతలు గళం వినిపించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. దీంతో వలస నేతలు వర్సెస్ ఒర్జినల్ కాంగ్రెస్ నేతలుగా సీన్ మారిపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ బ్యాగ్రౌండ్‌ ఉన్న 10 మందికిపైగా నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేయడంతో పార్టీలో సంక్షోభం మరింతగా ముదిరింది. 

ఈ క్రమంలోనే అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్.. నేతల  మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీలో పలువురు నేతలతో భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. పార్టీ నేతలతో సంప్రదింపుల అనంతరం గురువారం మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్.. నాయకులందరితో మాట్లాడనని చెప్పారు. పార్టీలో సమస్యలు అన్నీ సర్దుకున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలపై నాయకులు బయట మాట్లాడొద్దని కోరారు. 

click me!