రేపోమాపో కాంగ్రెస్‌తోనే మమత బెనర్జీ: వీహెచ్ సంచలనం

Published : Feb 22, 2022, 03:55 PM ISTUpdated : Feb 22, 2022, 04:08 PM IST
రేపోమాపో కాంగ్రెస్‌తోనే మమత బెనర్జీ: వీహెచ్ సంచలనం

సారాంశం

కాంగ్రెస్ లేకుండా థర్డ్‌ఫ్రంట్ సాధ్యం కాదని ఆ పార్టీ సినియర్ నేత వి.హనుమంతరావు చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  

హైదరాబాద్: Congress తో ఉన్న పార్టీలు బలపడితేనే Third Front సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నేత V.Hanumantha Rao చెప్పారు. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. నేడో రేపో Mamata Banerjee కాంగ్రెస్ పార్టీతోనే వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయమై Shiv Sena అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ లేకుండా థర్డ్‌ఫ్రంట్ ఉండదని ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని కాదని ఇతర పార్టీలు అన్నీ కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయలేరని ఆయన చెప్పారు. ఈ విషయమై కేసీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

దాణా కుంభకోణంలో చివరిదైన ఐదో కేసులో RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు జైలు శిక్ష విధించడంపై  హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఓబీసీ వర్గానికి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలుశిక్ష పడడం తనను బాధించిందని చెప్పారు.

ప్రతిపక్షం లేకుండా చేయాలనేది మోదీ కుట్ర అని  వీహెచ్ ఆరోపించారు. బీజేపీలో చేరితే కేసులు పట్టించుకోవడంలేదని అన్నారు. మోదీతో చేతులు కలిపి ఉంటే లాలూ జైలుకు వెళ్లేవారు కాదని అభిప్రాయపడ్డారు. లాలూ జైలుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు కానీ, మోదీతో మాత్రం చేతులు కలపలేదని పేర్కొన్నారు.

తెలంగాణ సీఎంKCR ఎన్డీయేతర సీఎంలు, పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. BJPకి వ్యతిరేకంగా కేసీఆర్ ఎన్డీయేతర సీఎంలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.గతంలోనే తమిళనాడు సీఎం Stalin, కేరళ సీఎం విజయన్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 20వ తేదీన కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీతో కేసీఆర్  ఇటీవల ఫోన్‌లో చర్చించారు. త్వరలోనే మమత బెనర్జీతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ తరుణంలోనే  ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న  పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు  టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.

కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలపై బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు.  కేసీఆర్ ప్రజల దృష్టిని మరల్చేందుకు దేశ రాజకీయాలపై దృష్టి అనే అంశాన్ని ముందుకు తెచ్చారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే