కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (v hanumantha rao) రోశయ్యకు నివాళులర్పించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ రోశయ్య మృతి ఎంతో బాధను కలిస్తోందన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. ముఖ్యమంత్రిగా రోశయ్యను ప్రశాంతంగా పని చేసుకోనివ్వకుండా హింసించారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ (congress) కురువృద్ధుడు, ఉమ్మడి ఏపీ మాజీ మఖ్యమంత్రి రోశయ్య మరణంతో తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ ప్రముఖులందరూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. రోశయ్య సేవలను, ఆయనతో వారికున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీ . కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (v hanumantha rao) సైతం రోశయ్యకు నివాళులర్పించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ రోశయ్య మృతి ఎంతో బాధను కలిస్తోందన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. ముఖ్యమంత్రిగా రోశయ్యను ప్రశాంతంగా పని చేసుకోనివ్వకుండా హింసించారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ప్రశాంతంగా పని చేసుకోనివ్వలేదనే బాధ ఆయనలో ఉండేదని వీహెచ్ చెప్పారు. అప్పట్లో ప్రతి ఒక్కరూ రోశయ్యను ఉపయోగించుకున్నారని హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ALso Read:Konijeti Rosaiah Death: రోశయ్య పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళి..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి చేరుకున్న కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రోశయ్య పార్థివదేహం వద్ద పుష్పగుచ్చంఉంచి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో ఉన్న తమ ఫామ్ హౌస్ లో రేపు అంత్యక్రియలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ కు రోశయ్య కుటుంబసభ్యులు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అమీర్‌పేటలోని రోశయ్య ఇంటికి చేరుకుని.. ఆయన పార్థివదేహానికి నివాళులర్పిస్తున్నారు.
మరోవైపు రోశయ్య మృతిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సంతాపం తెలిపింది. మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. డిసెంబర్ 4,5,6 తేదీలను సంతాప దినాలు పాటించాలని ఆదేశించింది. రోశయ్య అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయింది. ఈ నేపథ్యంలో రేపు రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.