నిజమే...నాకూ రెడ్లతో అన్యాయం జరిగింది : వి. హన్మంతరావు

First Published Jun 23, 2018, 5:18 PM IST
Highlights

అంతమాత్రాన కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్న విహెచ్

కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాల ఆధిపత్యానికి తాను కూడా బలయ్యానని ఆ పార్టీ సీనియర్ నాయకులు హన్మంతరావు అన్నారు. అయితే అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదన్నారు. తనకు రాజకీయ జీతవితాన్నిచ్చిన పార్టీలోనే జీవించినంత కాలం ఉంటానని విహెచ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ లో బిసిలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని, వారికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుడు దానం నాగెందర్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. తపకే కాదు కాంగ్రెస్ సీనియర్ బిసి నాయకులు హన్మంతరావుతో పాటు, పొన్నాల లక్ష్మయ్య కు కూడా తగిన గౌరవం లభించడం లేదని దానం ఆరోపించారు. 

ఈ వ్యాఖ్యలకు విహెచ్ తాజాగా స్పందించారు. కాంగ్రెస్ లో బిసిలకు అన్యాయం జరిగుతున్న మాట వాస్తవమే కానీ అలాగని రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీని వీడటం తప్పన్నారు. అగ్రకులాల ఆధిపత్యాన్ని అదిగమించాలి కాసీ పారిపోవడం రాజకీయ నాయకుడి లక్షణం కాదన్నారు. ఇలాంటి సమస్యలు పార్టీ పెద్దలముందు, వేధికలపై చర్చించాలని హన్మంతరావు సూచించారు.  

పార్టీలో ఎలాంటి తప్పు జరిగినా పార్టీ వేదికపైనే తాను నిలదీస్తానని, భవిష్యత్‌లో కూడా ఇదే విధంగా ఉంటానని వీహెచ్ పేర్కొన్నారు. అలాంటిది నిమ్న కులాల అవకాశాలను ఉన్నత వర్గాల వారు దోచుకుంటుంటే ఎలా చూస్తూ ఉంటానని అన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగేవరకు వెనుకడుగు వేయనని, అలాగని కాంగ్రెస్ ను వీడి మరో పార్టీలో చేరనని వీహెచ్ స్పష్టం చేశారు.

ఇక దానం పార్టీ మారడం ఆయన ఇష్టమని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు హన్మంతరావు తెలిపారు.  
 

 

click me!