ఇందిరమ్మ ఇళ్లు కాజేసింది ఎవరు?.. వరంగల్‌లో పోస్టర్ల కలకలం.. పోలీసుకు ఫిర్యాదు చేసిన రాజేందర్ రెడ్డి

Published : Dec 24, 2022, 01:48 PM IST
ఇందిరమ్మ ఇళ్లు కాజేసింది ఎవరు?.. వరంగల్‌లో పోస్టర్ల కలకలం.. పోలీసుకు ఫిర్యాదు చేసిన రాజేందర్ రెడ్డి

సారాంశం

వరంగల్‌‌లో వెలిసిన పోస్టర్లు  కలకలం రేపుతున్నాయి. హన్మకొండలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. 

వరంగల్‌‌లో వెలిసిన పోస్టర్లు  కలకలం రేపుతున్నాయి. హన్మకొండలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. 500 ఇందిరమ్మ ఇళ్లు కాజేసింది ఎవరు రాజేంద్ర? అని రాసి ఉన్న పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. పోస్టర్లలలో నాయిని రాజేందర్ ఫొటో కూడా ఉంచారు. తనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడంపై రాజేందర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీలోని కోవర్టులు, ఎమ్మెల్యే  దాస్యం వినయ్‌భాస్కర్‌అనుచరులే పోస్టర్లు వేశారని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. పోస్టర్ల వ్యవహారానికి సంబంధించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?