సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో ముస్లీంలకు ఆ రంజాన్ గిప్ట్ ఇప్పించాలి : షబ్బీర్ అలీ

First Published Jun 14, 2018, 5:29 PM IST
Highlights

లేదంటే సీఎం ముస్లీం ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న షబ్బీర్ అలీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మండిపడ్డారు. తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ డిల్లీకి వెళుతున్నారు కాబట్టి ప్రధాని మోదీని ఈ రిజర్వేషన్ల కోసం ఒప్పించి ముస్లీం ప్రజలకు రంజాన్ గిప్టుగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా చేయలేని పక్షంలో వెంటనే ముస్లీం సమాజానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. 

అలాగే పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఈ విభజన చట్టంలోని హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని అన్నారు. ఎప్పటివరకు నేరవేరుస్తారో వారి నుండి స్పష్టమైన హామీ తీసుకోవాలని సీఎం కు సూచించారు.

కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా హామీల అమలుకు కృషి చేయటం మానేసిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో కూర్చొని ఇదే ప్రపంచం అనుకుంటున్నారని, ఒక్కసారి బైటికి వచ్చి ప్రజల కష్టాలు చూడాలంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ రాష్ట్ర హక్కులను  కేంద్రం వద్ద తాకట్టు పెట్టి తన కుటుంబ ప్రయోజనాల కోసం డిల్లీ యాత్రలు చేపడుతున్నారని షబ్బీర్ అలి విమర్శించారు.

click me!