Shabbir Ali: "సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుండే.. " : కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Published : Aug 25, 2023, 06:33 PM IST
Shabbir Ali: "సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుండే.. " : కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణలో రాజకీయ వేడి రగులుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాల పేలుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేయడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు.

ఎన్నికల సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార బి ఆర్ ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా 119 గాను 115 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. 
 
దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లను ఖరారు చేశారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ అటు గజ్వేల్ లోను, కామారెడ్డి లోను పోటీ చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాలలో చర్చనీయంగా మారింది.  ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా మలుచుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ కు గెలుస్తానని నమ్మకం  లేకపోవడంతో.. రెండు స్థానాలలో పోటీ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 

తాజాగా టీపీసీసీ సమన్వయ కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా సీఎం కేసీఆర్ పై ఆరోపణలు గుర్తించారు. శుక్రవారం నాడు కామారెడ్డిలో నియోజకవర్గ కాంగ్రెస్ అనుబంధ సంస్థల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో   ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన భూములను అమ్ముకోవడానికే కామారెడ్డికి వస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు కానీ ఆయన పతనం కామారెడ్డి నుండి ప్రారంభమవుతుందని, ఆ పార్టీని కామారెడ్డి ప్రజలు భూస్థాపితం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్, గజ్వేల్ లో రింగ్ రోడ్డు పేరుతో వందల ఎకరాల భూములను కామారెడ్డి పై కన్నేసారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. కెసిఆర్ దృష్టిలో ప్రభుత్వ భూములను వేలం వెయ్యడమే గొప్ప అభివృద్ధిని భావిస్తున్నారని విమర్శించారు.

అంతేకాకుండా.. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కాంట్రాక్టర్ తో కెసిఆర్ కుమ్మక్కయ్యారని, లక్షల కోట్ల కమిషన్లు దండుకొని నాణ్యతలేని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశారు.

రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కల్వకుంట్ల ఫ్యామిలీ అక్రమంగా దోచుకున్న అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతామని సంచలన చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవితను జైలుకు పంపుతామన్నారు. కెసిఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదని, ఎంతోమంది అమాయకులు బలిదానాలు చేశారని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ కల నెరవేరిందని అన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో కల్వకుంట్ల కుటుంబానికి,  కాంగ్రెస్ సైనికులకు మధ్య  కౌరవ- పాండవుల యుద్ధం జరగబోతోందని, ఈ ధర్మ యుద్ధంలో కౌరవులను ఓడించాలన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో మార్పు కోరుకుంటే కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ