కారణమిదీ:కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి లేఖ

By narsimha lodeFirst Published Feb 28, 2021, 5:45 PM IST
Highlights

శనగ పంటకు మద్దతు ధర కల్పించడం సహా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.


హైదరాబాద్: శనగ పంటకు మద్దతు ధర కల్పించడం సహా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే రాష్ట్రంలో శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు.  వ్యాపారులు, దళారులపై ప్రభుత్వ నియంత్రణ లేని కారణంగా ఈ పరిస్థితి నెలకొందన్నారు. 

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్లు పూర్తిగా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు.

శనగకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 5100 మద్దతు ధరతో రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు. ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల మద్దతు ధర రాకపోవడం క్వింటాలుకు రూ. 700 నుండి రూ. 1000 వరకు నష్టపోతున్నారన్నారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.శనగల కొనుగోలుకు తక్షణమే మార్క్‌ఫెడ్ కు ఆదేశాలు జారీ చేయాలలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

click me!